Banks Bandh : కేంద్ర ప్రభుత్వంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) జరిపిన చర్చలు ఫలించకపోవడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది.
ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ నెల 28, 29 మరియు 30 తేదీలలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకుల బంద్ యథావిధిగా కొనసాగుతుందని బ్యాంక్ యూనియన్ల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సమ్మేను విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమ్మే కారణంగా నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ వంటి కీలక సేవలతో పాటు క్షేత్రస్థాయి బ్యాంకింగ్ లావాదేవీలన్నీ స్తంభించిపోయే ప్రమాదం ఉండటంతో సాధారణ ప్రజలతో పాటు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.

విఫలమైన చర్చలు.. 5 రోజుల పనిదినాల డిమాండ్‌పై పట్టు!
వారానికి 5 రోజుల పనిదినాలను (5-Day Work Week) అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పలు దీర్ఘకాలిక సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బ్యాంకింగ్ ఉద్యోగులు ఈ నిరసన బాట పట్టారు. ప్రభుత్వం మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) అధికారులతో నిర్వహించిన సమన్వయ చర్చల్లో సానుకూల నిర్ణయం రాకపోవడంతోనే బంద్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సమ్మే సమయాల్లో డిజిటల్, యూపీఐ (UPI) సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎటిఎమ్‌లలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఖాతాదారులు ముందస్తుగా అవసరమైన నగదును సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

