Dailyhunt
చెల్లెలి ప్రేమ.. అన్నల పగ! పొలంలో ఆ రాత్రి ఏం జరిగింది?

చెల్లెలి ప్రేమ.. అన్నల పగ! పొలంలో ఆ రాత్రి ఏం జరిగింది?

వార్త 1 week ago

Gujarat Crime: గుజరాత్‌లోని రాజులాలో చోటుచేసుకున్న ఈ దారుణ హత్యోదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.

Read Also:RTC Driver Ravinder: భూపాలపల్లి ఆర్‌టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు

ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసింది

మృతుడు దినేష్‌కు, నిందితుల సోదరి సోనాల్‌కు మధ్య ఏడాది క్రితం ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ సమయంలో దినేష్ ఆమెను మొర్బీకి తీసుకెళ్లడం, ఆపై రెండు నెలల తర్వాత ఆమె తిరిగి తండ్రి ఇంటికి రావడం జరిగింది. ఈ క్రమంలో తమ కుటుంబ గౌరవం దెబ్బతిందని భావించిన సోనాల్ సోదరులు దినేష్‌పై పగ పెంచుకున్నారు.

 Honor killing in Gujarat Rajula

Gujarat Crime: ఘటన జరిగిన తీరు

ఏప్రిల్ 18న దినేష్ తన స్నేహితుడి పొలంలో ఉండగా నిందితులు రాజేష్, సుర్‌సింగ్, కేవల్ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. ‘మా పరువు తీశావు’ అంటూ దినేష్‌ను దూరంగా తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు.దాదాపు రెండు గంటల పాటు బెల్టులు, తాళ్లతో ఒకరి తర్వాత ఒకరు దినేష్‌ను తీవ్రంగా కొట్టారు. తల, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలైన దినేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. పరువు కోసమే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

యూపీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం: ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha