Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చేనేత కార్మికులకు శుభవార్త.. ఆ రోజున ఖాతాల్లో రూ. 25 వేలు

చేనేత కార్మికులకు శుభవార్త.. ఆ రోజున ఖాతాల్లో రూ. 25 వేలు

వార్త 1 week ago

AP Netannaku Bharosa: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించనుంది. 'నేతన్నకు భరోసా' పథకం ద్వారా ప్రతి అర్హులైన చేనేత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

రాబోయే జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న ఈ పథకాన్ని నేరుగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

Read Also : Somireddy Chandramohan Reddy: మంత్రి లోకేశ్‌ను విమర్శించే అర్హత కాకాణికి లేదన్న సోమిరెడ్డి

 Good news for handloom weavers… Rs. 25,000 to be credited to accounts on that day.

AP Netannaku Bharosa: 54 వేల మందికి లబ్ధి.. అదనంగా రూ. 1,000 పెంపు!

ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54,000 మంది చేనేత కార్మికులు అర్హులుగా ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ. 25,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది. గతంలో ఉన్న ప్రభుత్వం రూ. 24,000 అందిచగా, కూటమి ప్రభుత్వం దానికి అదనంగా మరొక రూ. 1,000 పెంచి మొత్తం రూ. 25,000 అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయింపు

చేనేత రంగానికి ప్రాధాన్యమిస్తూ, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం సమర్థవంతమైన అమలు కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 250 కోట్లను కేటాయించింది. పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు, దరఖాస్తు ప్రక్రియ, మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా విడుదల చేయనుంది.

ఉద్యోగాలు, అవకాశాలపై యువత అసహనం.. జగన్ ఆరోపణలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha