CSK LIVE Score Updates: 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై(CSK) సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి చెన్నై టాప్ ఆర్డర్ కుప్పకూలింది.
పవర్‌ప్లే ముగియక ముందే ముగ్గురు కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ సందడి మొదలైంది.
తొలి ఓవర్లోనే షాక్
ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) జాకబ్ డఫీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఒక సిక్సర్‌తో జోరు మీద కనిపించినా, భారీ షాట్‌కు ప్రయత్నించి దొరికిపోయాడు. ఆ వెంటనే వచ్చిన ఆయుష్ మ్హత్రే (1) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సంజు శాంసన్ (9) కూడా నిరాశపరచడంతో చెన్నై 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
CSK LIVE Score Updates: సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు
వికెట్లు పడుతున్నా ఒకవైపు సర్ఫరాజ్ ఖాన్ ధైర్యంగా పోరాడుతున్నాడు. ఆర్సీబీ పేసర్లను ఎదుర్కొంటూ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి సర్ఫరాజ్ 30 పరుగులతో క్రీజులో ఉండటంతో చెన్నై ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే, విజయానికి కావాల్సిన రన్ రేట్ 13 పైన ఉండటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతం చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెన్నైని కట్టడి చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

