Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చేపల రైతు చేతుల్లో దేశ ఆహార భద్రత

చేపల రైతు చేతుల్లో దేశ ఆహార భద్రత

వార్త 0 months ago

Fish farmer : ప్రతి సంవత్సరం జూలై 10న భారత దేశం జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హిస్తుంది. దేశ ఆహార భద్రతకు, పోషకాహార అవసరాలకు తోడ్పడుతు న్న మత్స్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న లక్షలాది చేపల రైతులు, మత్స్యకారులు, ఆక్వా ప్రెన్యూర్ల అంకిత భావానికి, కృషికి గుర్తింపుగా ఈ దినోత్సవం నిర్వహించ బడు తుంది.

ఇది కేవలం ఒక రోజువేడుక మాత్రమే కాకుండా, దేశమత్స్య పారిశ్రామిక అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ప్రేర ణాత్మక దినంగా నిలుస్తోంది. ఈ దినోత్సవాన్ని జూలై 10న జరుపుకోవడానికి ఒక ప్రత్యేక నేపథ్యం ఉంది. 1957లో ఇదే తేదీన, ప్రముఖ భారతీయ మత్స్య శాస్త్ర వేత్తలు డాక్టర్ హీరాలాల్ చౌదరి, డాక్టర్ కె. హెచ్. అలీ కుని ఒడిశాలోని అంగుల్లో మేజర్ కార్ప్ చేపలపై హైపో ఫిసేషన్ అనే శాస్త్రీయ సాంకేతికతను విజయవంతంగా ప్రయోగించారు. ఈ సాంకేతికత ద్వారా చేపల ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ఫలితం గా దేశంలో వాణిజ్య ఆక్వాకల్చర్కు బలమైన భూమిక ఏర్పడింది. మత్స్య పాలనలో శాస్త్రీయత, ఉత్పాదకత పెరిగి నీలి విప్లవానికి నాంది పలికింది. నీలి విప్లవం ఫలి తంగా భారత దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద చేపల ఉత్పత్తి దారుగా నిలిచింది.

 Fish farmer

Fish farmer : మార్కెటింగ్ రంగాల్లో అభివృద్ధికి పునాదులు

దేశం మొత్తంలో చేపల ఉత్ప త్తిలో సుమారు 65 శాతం వాణిజ్య ఆక్వాకల్చర్ ద్వారానే లభిస్తోంది. 2023-24 సంవత్సరానికి గాను భారత్లో చేపల ఉ త్పత్తి సుమారు 174లక్షల మెట్రిక్ టన్నులు కాగా, వీటిలో 131లక్షల మెట్రిక్ టన్నులు ఆక్వాకల్చర్ నుంచి లభించాయి. అంతేకాకుండా, దేశీయ మత్స్య ఉత్ప త్తిలో భారత్ వాటా ప్రపంచ స్థాయిలో 8శాతంగా ఉంది. ఈరంగం దాదాపు 2.8కోట్ల మంది మత్స్యకారులకు ప్రత్య క్షంగా లేదా పరోక్షంగా జీవనాధారంగా మారింది. ఈ రం గంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ముందంజ లో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోని చేపల ఉత్పత్తిలో దాదాపు 35 శాతం వాటాను కలిగిఉంది. సరైన విధానాలు, సాగు కోసం అనుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఈ రాష్ట్రాలు స్త్రీ మత్స్య రంగంలో అత్యుత్తమ స్థానాలను ఆక్రమించాయి. కేంద్ర ప్రభుత్వం నీలి విప్లవాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన వంటి పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా యి చేపల ఉత్పత్తిని పెంచడమే కాకుండా. పోస్టర్వెస్ట్ మేనేజ్మెంట్, శీతల భద్రపరిచే భవనాలు, రవాణా సదుపాయాలు, మార్కెటింగ్ మద్దతు వంటి రంగాల్లో అభివృద్ధికి పునాదులు వేశాయి. యువతకు ఉపాధి అవకాశాలు స్త్రీ కల్పించడం, మహిళల పాత్రను పెంచ డం, స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. 2023-24లో పిఎమ్ఎమ్ఎస్ఎస్ కింద దాదాపు 2,500 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు జరి గాయి.

 Fish farmer

ఆహార భద్రతకు కాపలా దారుడిగా..

నూతన ఆవిష్కరణలతో బయోఫ్లాక్, ఆర్సీఆర్ఎస్, ఇంటెన్సివ్ కల్చర్ పద్ధతులు రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తిని అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. నీటి వనరుల సమర్థ వినియోగం, ఆరోగ్య సంరక్షణ, చేపల AP నిర్వహణ వంటి అంశాల్లో శాస్త్రీయ మార్గదర్శకాలు ఇవ్వడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు సాగుతున్నాయి. అయితే, ఈరంగం ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా తక్కువ కావు. నీటి కాలుష్యం, సకా లంలోమార్కెట్ మద్దతు లేకపోవడం, సరైన ధరకే విక్రయానికి అవకాశాలు లేకపోవడం, రవాణా లోపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లో లేకపోవడం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. జలవనరుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు కూడా తక్షణ పరిష్కారం కోరు కుంటున్నాయి. జాతీయ చేపల రైతుల దినోత్సవం సంద ర్భంగా కేంద్రం, రాష్ట్రాలస్థాయిలో ఆవార్డులు, సన్మానాలు, శిక్షణా AC శిబిరాలు, ప్రదర్శ నలు, సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించడం ద్వారా మత్స్యరంగ అభివృద్ధికి కొత్త దిక్సూచి చూపే ప్రయత్నం జరుగుతోంది. ఈ వేదికల్లో రైతులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు పరస్పరంగా జ్ఞానా న్నిపంచుకుంటూ వ్యవస్థను మెరుగు పరిచే మార్గాలు అన్వే పిస్తున్నారు. ఈ నేపథ్యం లో జాతీయ చేపల రైతుల దినో త్సవం కేవలం స్మరణ దినంగా మాత్రమేకాక, మత్స్య రంగానికి విశిష్ట దిశానిర్దేశం చేసే ఒక ఉ 2 ద్యమంగా మారాలి. ప్రతి నీటి రైతు భారత ఆహార భద్రతకు కాపలా దారుడి గా నిలుస్తున్నాడు. వారి శ్రమకు, అంకిత భావానికి గౌరవం తెలుపడమే ఈ దినోత్సవ అసలైన ఉద్దేశం.

-రామ కిష్టయ్య సంగనభట్ల

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

మంచినీటి చేపల సాగులో ఏపీ నంబర్ వన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha