Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Cherlapally crime: పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

Cherlapally crime: పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

వార్త 4 months ago

Cherlapally crime: హైదరాబాద్‌లోని చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.

ఈ విషాదానికి ప్రధాన కారణం ఆమె ఎదుర్కొన్న తీవ్రమైన డిప్రెషన్ (Severe depression) అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Read Also: HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం

పోలీసుల విచారణ

పోలీసుల విచారణలో కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. విజయారెడ్డి తన పిల్లలను మొదటి నుంచి అత్యంత క్రమశిక్షణతో, తన మాటను అస్సలు జవదాటకుండా పెంచారు. పిల్లలు పూర్తిగా ఆమె నియంత్రణలోనే (Control) ఉండేవారని సమాచారం. ఈ క్రమంలోనే, తీవ్ర మనస్తాపానికి గురైన విజయారెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె మాటపై ఉన్న గౌరవం లేదా విధేయత కారణంగా పిల్లలు కూడా ఆమె వెంటే వెళ్ళడానికి సిద్ధపడ్డారు. జనవరి 30న జరిగిన ఈ దారుణ ఘటనకు తల్లే స్వయంగా నిర్ణయం తీసుకున్నట్లు విచారణలో తేలింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha