Nallamada Road Accident: బైక్‌పై వేగంగా వెళ్తున్న ముగ్గురు యువకులు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్‌లో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఈ విషాదకర ఘటన శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో చోటుచేసుకుంది.
Read Also : Periyapalayam Accident: లారీని ఢీకొట్టిన ఆటో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి!
Bike crashes into tree; three youths killed.
వివరాల్లోకి వెళితే.. ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులను అడిగి వివరాలు సేకరించారు.
Nallamada Road Accident: మృతుల గుర్తింపు..
మృతులను పుట్టపర్తికి చెందిన అనిల్, కొత్తచెరువు వాసి అర్జున్, గోరంట్లకు చెందిన దీక్షిత్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించడంతో వారి కుటుంబాల్లో, ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

