Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chhattisgarh :108 మంది మావోయిస్టుల సరెండర్.. పాపారావు లొంగుబాటుపై సస్పెన్స్

Chhattisgarh :108 మంది మావోయిస్టుల సరెండర్.. పాపారావు లొంగుబాటుపై సస్పెన్స్

వార్త 2 months ago

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి భారీ విఘాతం కలిగింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన 108 మంది మావోయిస్టులు బుధవారం జగదల్‌పూర్‌లో భద్రతా దళాల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 'ఆపరేషన్ కగార్' (Operation Kagaar) గడువు సమీపిస్తున్న తరుణంలో, ఇంత పెద్ద ఎత్తున క్యాడర్ జనజీవన స్రవంతిలోకి రావడం మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది.

పాపారావు లొంగిపోయారా?

ఈ లొంగుబాటులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత, టాప్ కమాండర్ పాపారావు (Paparao) కూడా ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా భద్రతా దళాలు ఆయన లక్ష్యంగా 'ఆపరేషన్ పాపారావు' పేరుతో బస్తర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. దక్షిణ బస్తర్‌లో బలమైన పట్టున్న పాపారావు ఒకవేళ లొంగిపోయి ఉంటే, అది మావోయిస్టు వ్యవస్థ కుప్పకూలడానికి సంకేతంగా మారుతుంది. లొంగిపోయిన వారిలో మహిళా క్యాడర్ మరియు కీలక బాధ్యతలు నిర్వహించే దళ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha