Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chhattisgarh crime: వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి

Chhattisgarh crime: వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి

వార్త 3 months ago

Chhattisgarh crime: ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో మానవత్వం సిగ్గుపడేలా ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు అందుబాటులో లేకపోవడంతో ఒక స్వీపర్ డాక్టర్‌గా మారి ప్రసవం చేయడానికి ప్రయత్నించడం, ఫలితంగా ఒక పసికందు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

Read Also:IT Ride : ఐటీ రైడ్లో సీక్రెట్ రూమ్.. రూ.కోట్ల విలువైన బంగారం!

అసలేం జరిగిందంటే?

లఖన్‌పూర్ గ్రామానికి చెందిన గౌరీ యాదవ్ అనే గర్భిణికి ఫిబ్రవరి 16వ తేదీ రాత్రి పురిటి నొప్పులు రావడంతో కున్నీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కు తరలించారు. అయితే, ఆ సమయంలో ఆసుపత్రిలో కనీసం ఒక్క నర్సు కూడా అందుబాటులో లేరు. దీంతో అక్కడ పని చేసే 'శ్యామ్ పతి' అనే స్వీపర్ గర్భిణిని పరీక్షించి, అడ్మిట్ చేసుకుంది.

మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఆ స్వీపరే ప్రసవం చేయడానికి ప్రయత్నించగా, శిశువు గర్భంలో అడ్డం తిరిగింది (బ్రీచ్ పొజిషన్). పరిస్థితి విషమించాక డాక్టర్ చేరుకుని డెలివరీ చేసినప్పటికీ, అప్పటికే శిశువు మృతి చెందింది.

బ్రీచ్ ప్రెజెంటేషన్ :

సాధారణంగా ప్రసవ సమయంలో శిశువు తల ముందుగా బయటకు రావాలి. కానీ, బ్రీచ్ ప్రెజెంటేషన్‌లో కాళ్లు లేదా వెనుక భాగం కిందకు ఉంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిపుణులైన వైద్యులు సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. అయితే అనుభవం లేని స్వీపర్ జోక్యం చేసుకోవడం వల్లే తమ బిడ్డను కోల్పోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల వివరణ

ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ పీఎస్ మార్కో స్పందిస్తూ.. ఆ రోజు డ్యూటీలో ఉండాల్సిన నర్సు గైర్హాజరు కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమికంగా తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha