Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిలకపచ్చ రంగులో ఇందిరమ్మ చీరల పంపిణీ

చిలకపచ్చ రంగులో ఇందిరమ్మ చీరల పంపిణీ

వార్త 2 weeks ago

Indiramma sarees:రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ చీరలు అందుతాయి.

జిల్లాకు మొత్తం మూడు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల యాభై ఐదు చీరలు అవసరం ఉండగా ఇప్పటివరకు లక్ష నలభై ఆరు వేల ఏడు వందల పదకొండు చీరలు చేరాయి. వచ్చిన స్టాక్ ను మండల కేంద్రాల్లోని సమాఖ్య కార్యాలయాల్లో భద్రపరిచారు. అర్హులైన ప్రతి మహిళకు ఈ పధకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు.

Read also: TG BC Women Appointments: ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

 Distribution of ‘Indiramma’ sarees to women.

పాలేరుకు అధిక ప్రాధాన్యత

రాష్ట్ర ప్రభుత్వం మండలాల వారీగా స్టాక్ పాయింట్లకు విడతల వారీగా చీరలు చేరవేస్తోంది. గణాంకాల ప్రకారం జిల్లాలోనే అత్యధికంగా పాలేరు నియోజకవర్గానికి అరవై ఒకటి వేల ఐదు వందల ఇరవై మూడు చీరలు వచ్చాయి. ఇందులో ఖమ్మం రూరల్ మండలానికి పదమూడు వేల రెండు వందల ఎనభై ఏడు, కూసుమంచికి పదిహేనే వేల నూట పదిహేడు చీరలు కేటాయించారు. మధిర నియోజకవర్గానికి ముప్పై ఐదు వేల నూట ఎనభై మూడు చీరలు రాగా చింతకాని మండలానికి పదహారు వేల ఇరవై చీరలు చేరాయి. మరో విడతలో బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలకు చీరలు రానున్నాయి.

Indiramma sarees:చిలకపచ్చ రంగు చీరల ప్రత్యేకత

ఈసారి ప్రభుత్వ ఆదేశాల కింద తెలంగాణ సంప్రదాయానికి ప్రతిగా ప్రత్యేక రంగు చీరను అందజేశారు. ఈ కొత్త డిజైన్ ఆధునికతకు అనుగుణంగా గులాబీ రంగు అంచుతో కూడిన చిలకపచ్చ రంగు చీరను రూపొందించారు. సంప్రదాయ రీతిలో తీర్చిదిద్దిన జాతీయ, ఆధునిక డిజైన్ తో కూడిన చీరను చేనేత కార్మికులతో తయారు చేయించి జిల్లాకు చేరూరుతున్నట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా భద్రపరిచిన చీరలను పారదర్శకంగా పంపిణీ చేయడానికి అధికారులు అన్ని చర్యలు పూర్తి చేశారు.

Epaper: epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha