Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిల్కూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు

చిల్కూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు

వార్త 1 week ago

H1B Visa Controversy: అమెరికాలో వలస విధానాలు, ముఖ్యంగా ఐటీ రంగానికి ఇచ్చే H-1B వీసాలపై అక్కడి రాజకీయ నాయకులు తరచూ చేసే విమర్శలు ఈసారి కొత్త వివాదానికి తెరలేపాయి.

అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిట్ H-1B, L-1, F-1 వంటి వీసా ప్రోగ్రామ్‌ల వల్ల అమెరికాలోని మధ్యతరగతి పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆరోపించారు. అయితే, ఈ క్రమంలో ఆయన హైదరాబాద్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిల్కూరు బాలాజీ ఆలయాన్ని ‘వీసాల దేవాలయం’ అని సంబోధించడం, భారతీయులు అమెరికా ఉద్యోగాలను లాగేసుకుంటున్నారనే ధోరణిలో మాట్లాడటం తీవ్ర కలకలం రేపింది.

Read Also :Vladimir Putin China Visit: మే 19 నుండి చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన!

H1B Visa Controversy: వీసా టెంపుల్' అంటూ వివాదం!

ఈ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అక్కడి సాంకేతిక విప్లవానికి భారతీయులు అందిస్తున్న సహకారాన్ని విస్మరించి, ఎన్నికలు లేదా రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి విమర్శలు చేయడం తగదని హితవు పలుకుతున్నారు. చట్టబద్ధంగా, తమ ప్రతిభ ఆధారంగానే భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారని, ఒక పవిత్రమైన ఆలయ విశ్వాసాలను ఈ వివాదంలోకి లాగడం అత్యంత దురదృష్టకరమని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha