Kadapa child murder case: వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర కలకలం రేగింది. లోపట్నుతల గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి నిత్విక అనుమానాస్పద మృతి కేసులో నిజాలు వెలుగులోకి వచ్చాయి.
మొదట సాధారణ మరణంగా భావించిన ఈ ఘటనను పోలీసులు విచారించగా, అది పక్కా ప్రణాళికతో జరిగిన కిరాతక హత్యగా తేలింది. పాత కక్షలను మనసులో పెట్టుకుని పక్కింటి వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో స్పష్టమైంది.
Read also: AP weather updates: నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వానలు, పిడుగుల సూచన!
Sensational turn in little Nithvika’s death case; police confirm it as murder.
Kadapa child murder case: నీళ్ల డ్రమ్ములో ముంచి కిరాతక హత్య
పోలీసుల కథనం ప్రకారం.. లోపట్నుతల గ్రామానికి చెందిన పక్కింటి దంపతులు స్వాతి, రామిరెడ్డిలకు చిన్నారి కుటుంబంతో కొంతకాలంగా పాత కక్షలు, వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పగ పెంచుకున్న ఆ దంపతులు, ఇంట్లో ఒంటరిగా ఉన్న మూడేళ్ల బాలిక నిత్వికను పట్టుకుని నీళ్ల డ్రమ్ములో ముంచి అత్యంత అమానుషంగా ప్రాణాలు తీశారు. అనంతరం ఏమీ తెలియనట్లు నాటకమాడారు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నిందితులు స్వాతి, రామిరెడ్డిలను అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు.
ద్రాక్షారామ మార్కెట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 40 దుకాణాలు దగ్ధం

