Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చౌట్కూర్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

చౌట్కూర్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

వార్త 20 hrs ago

Professor Jayashankar 92nd Jayanthi: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపిన మహనీయుడు ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ 92వ జయంతిని.

సంగారెడ్డి జిల్లా చౌట్కూర్‌ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నామాల కిష్టయ్య, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శంకర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Read Also : New Ration Cards : తెలంగాణ లో ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు

 Professor Jayashankar’s birth anniversary celebrations held grandly in Choutkur.

Professor Jayashankar 92nd Jayanthi: జయశంకర్ సేవల స్మరణ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన కృషిని ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్షను రగిలించి, ఉద్యమానికి సిద్ధాంతపరమైన మార్గనిర్దేశం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ కన్న కలలను సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అధికారులు సూచించారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ పి. సువర్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్‌తో పాటు తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

తెలంగాణకు చేరిన తొలి నైసి కోల్ బొగ్గు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha