Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Coal Mafia : 'CM' అంటే కోల్ మాఫియా అంటూ KTR కీలక వ్యాఖ్యలు

Coal Mafia : 'CM' అంటే కోల్ మాఫియా అంటూ KTR కీలక వ్యాఖ్యలు

వార్త 4 months ago

తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి కుంభకోణం అంశం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందిస్తూ, సింగరేణి టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా బట్టబయలు చేశామని ప్రకటించారు.

ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ స్కామ్ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి విచారణ పేరిట కాలయాపన చేస్తోందని, అసలైన నిందితులను వదిలేసి ఇతరులను పిలుస్తూ డ్రామాలు ఆడుతోందని కేటీఆర్ ఆరోపించారు.

FTA: భారత్- ఈయూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం

ప్రస్తుత ముఖ్యమంత్రి తీరుపై కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలు మరియు సింగరేణి కార్మికులు ఇవాళ CM అంటే 'చీఫ్ మినిస్టర్' అని కాకుండా, 'కోల్ మాఫియా' (Coal Mafia) నాయకుడిగా భావించే పరిస్థితి నెలకొందని విమర్శించారు. సింగరేణికి సంబంధించిన కీలక టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేదని, దీనిపై ప్రభుత్వం ఒక శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని తాము డిమాండ్ చేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల చెమటతో నడిచే సింగరేణి సంస్థను కొందరు స్వార్థపరుల లాభాల కోసం తాకట్టు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha