Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Collector Himanshu Shukla: ప్రభుత్వ బ్యాంక్ ఖాతాలపై కలెక్టర్ సమీక్ష

Collector Himanshu Shukla: ప్రభుత్వ బ్యాంక్ ఖాతాలపై కలెక్టర్ సమీక్ష

వార్త 4 months ago

Collector Himanshu Shukla: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలన్నీ నిరంతరం వాడుకలో ఉండేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాలులో లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంకు మేనేజర్ (LDM) మణిశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాల స్థితిగతులపై కలెక్టర్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇన్‌యాక్టివ్ ఖాతాలపై సమీక్ష

ఈ సమావేశం ప్రారంభంలో, జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం వాడుకలో లేని (Inactive) బ్యాంకు ఖాతాల వివరాలను, వాటిలో ఉన్న నగదు నిల్వల సమాచారాన్ని ఎల్‌డిఎం మణిశేఖర్ కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, శాఖల వారీగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్ల వివరాలను క్షుణ్ణంగా సమీక్షించారు. ఏయే కారణాల వల్ల ఖాతాలు నిలిచిపోయాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Collector Himanshu Shukla: ఖాతాల పునరుద్ధరణకు మార్గదర్శకాలు

నిలిచిపోయిన ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత శాఖల హెచ్‌వోడిలు (HOD) రిక్వెస్ట్ లెటర్, ఆధార్ కార్డు, సిటిసి (CTC), ఐడి కార్డులతో ఆయా బ్యాంకులను సంప్రదించి ఖాతాలను వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఒకవేళ సదరు ఖాతాల అవసరం లేదని భావిస్తే, నిబంధనల ప్రకారం వెంటనే వాటిని క్లోజ్ చేయాలని స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ

ప్రభుత్వ ఖాతాల నిర్వహణపై డివిజన్ మరియు మండల స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ నిధుల వినియోగం, ఖాతాల నిర్వహణపై నిరంతరం సమీక్ష జరపాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) విజయ్‌కుమార్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha