Dailyhunt
Conflicts: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరో వ్యక్తి మృతి

Conflicts: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరో వ్యక్తి మృతి

వార్త 3 months ago

బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందూ మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. షరియత్‌పూర్ జిల్లాలో (Conflicts) ఖోకన్ చంద్ర దాస్ (50) అనే హిందూ వ్యాపారిపై దుండగులు అమానవీయంగా దాడి చేసి, సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచారు. మెడికల్ షాపు, మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించే ఖోకన్ దాస్, డిసెంబర్ 31 రాత్రి తన పని ముగించుకుని ఆటో రిక్షాలో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో తిలోయి ప్రాంతానికి చేరుకోగానే, కొందరు దుండగులు ఆటోను అడ్డుకున్నారు. ఖోకన్‌ను బయటకు లాగి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. అంతటితో ఆగకుండా, చనిపోయాడని నిర్ధారించుకోవడానికి ఆయన శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

Read also: Super Moon 2026: నేడు పౌర్ణమి.. పెద్దగా కనిపించనున్న చంద్రుడు

ప్రాణాలు కాపాడుకోవడానికి చెరువులోకి దూకిన బాధితుడు

మంటల సెగతో విలవిలలాడిన ఖోకన్, ప్రాణాలను కాపాడుకోవడానికి పక్కనే ఉన్న చెరువులోకి దూకారు. ఆయన అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకోగా దుండగులు పరారయ్యారు. వెంటనే ఆయనను షరియత్‌పూర్ సదర్ ఆసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో ఢాకాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. (Conflicts) ఖోకన్ శరీరంపై తీవ్రమైన కత్తిపోట్లతో పాటు ముఖం, తల చేతులు తీవ్రంగా కాలిపోయాయని వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన గాయాల తీవ్రత తట్టుకోలేక జనవరి 2న తుదిశ్వాస విడిచారు. తనపై దాడి చేసిన వారిలో రబ్బీ, సోహగ్ అనే వ్యక్తులను ఖోకన్ గుర్తించినట్లు ఆయన భార్య సీమా దాస్ పేర్కొన్నారు. గత రెండు వారాల్లో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన నాలుగో దాడి ఇది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మైనారిటీలకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

RailOne app: జనరల్ టికెట్లపై శుభవార్త.. ఆన్‌లైన్ బుకింగ్‌కు 3% డిస్కౌంట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha