
Cult Teaser Release: యంగ్ హీరో విశ్వక్‌సేన్ మరోసారి తనదైన స్టైల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'కల్ట్' ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా దమ్కీ' తర్వాత విశ్వక్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్న మూడో సినిమా ఇది కావడం విశేషం. ఇటీవల 'ఫంకీ' సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు మరింత బోల్డ్ కంటెంట్‌తో 'కల్ట్'ను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టీజర్ ను లాంచ్ చేశారు.
Actor Sivaji: ఆ వ్యాఖ్యలు చేసినందుకు 3 రోజులు నిద్రపోలేదు
రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు
అత్యంత హింసాత్మకమైన, ఉత్కంఠభరితమైన విజువల్స్‌తో ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.టీజర్ చూస్తే, గోవాలో స్నేహితులంతా కలిసి జరుపుకొనే ఓ పార్టీ, ప్రాణాలతో చెలగాటమాడే భయంకరమైన గేమ్‌గా మారుతుంది. ఈ గేమ్‌లో ఓడిన వారిని అతి కిరాతకంగా చంపేస్తుంటారు. ఈ డెడ్లీ గేమ్‌ను నడిపించే 'గేమ్ మాస్టర్' పాత్రలో విశ్వక్‌సేన్ కనిపించారు. తలలు నరకడం వంటి రక్తపాతంతో కూడిన షాట్స్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో తెలియజేస్తున్నాయి.
విష్వక్సేన్ దర్శకత్వం వహిస్తున్న మూడో చిత్రమిది. 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు రాయడం విశేషం. తారక్ సినిమాస్, వన్మయి క్రియేషన్స్ పతాకాలపై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
AMB Cinemas Bengaluru: AMB సినిమాస్‌ను సందర్శించిన మహేశ్ బాబు
