Double Bedroom Houses Inspection: తెలంగాణలో గతంలో పేదలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల (2BHK Housing Scheme) వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలోనే లబ్ధిదారులు నివసిస్తున్నారా? లేక వాటిని ఖాళీగా ఉంచి/అద్దెలకు ఇచ్చి వేరే ప్రాంతాల్లో నివాసముంటున్నారా? అనే అంశంపై అధికారులు 360 డిగ్రీల కోణంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
Read Also:Fee reimbursement telangana: విద్యార్థులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్
Double Bedroom Houses Inspection:15 వేల ఇళ్లలో నివసించట్లేదని గుర్తింపు

ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 15,000 మంది లబ్ధిదారులు తమకు కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసించడం లేదని అధికారులు గుర్తించారు. దీనిపై లబ్ధిదారుల నుంచి విచారణ చేపట్టి, స్పష్టమైన కారణాలు తెలుసుకున్న తర్వాత అవసరమైతే నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 66,127 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అసంపూర్తిగా ఉన్న మరో 22,120 ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఈ ఏడాది సెప్టెంబరు నాటికి లబ్ధిదారులకు అందించేందుకు పనులు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఇళ్లు నగరం, ఉపాధి కేంద్రాలకు దూరంగా ఉండటం, పిల్లల పాఠశాలలు/రవాణా సౌకర్యాలు లేకపోవడం మరియు కొన్ని చోట్ల మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లను అద్దెకు ఇచ్చి తిరిగి నగరాల్లోనే ఉంటున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిశీలన ద్వారా భవిష్యత్తులో గృహ కేటాయింపులను మరింత పారదర్శకంగా చేపట్టాలని మరియు అర్హులైన నిజమైన పేదలకే ఇళ్లు దక్కేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
Epaper: epaper.vaartha.com

