Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డచ్ రాజకుటుంబంపై హత్యాయత్నం: నెదర్లాండ్స్ యువరాణుల ప్రాణాలకు ముప్పు!

డచ్ రాజకుటుంబంపై హత్యాయత్నం: నెదర్లాండ్స్ యువరాణుల ప్రాణాలకు ముప్పు!

వార్త 1 month ago

నెదర్లాండ్స్‌లో రాజకుటుంబ లక్ష్యంగా జరిగిన ఒక దారుణమైన కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డచ్ యువరాణులు కేథరీనా-అమాలియా, ఆమె సోదరి అలెక్సియాలను హత్య చేసేందుకు ఒక దుండగుడు ప్రయత్నించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇటీవల రాజు విల్లె అలెగ్జాండర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.

Read Also: Samsung Inheritance Tax: శాంసంగ్ సంచలనం: 70 వేల కోట్ల వారసత్వ పన్ను చెల్లింపు పూర్తి

 Dutch Royal Family

Dutch Royal Family: ఆయుధాల స్వాధీనం

నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుండి రెండు గొడ్డళ్లు, రాజకుటుంబంపై విద్వేషాన్ని వెళ్లగక్కే రాతప్రతులు ఉన్న కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. యువరాణి కేథరీనా-అమాలియా గతంలో కూడా అనేక భద్రతాపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 2020లో సోషల్ మీడియా వేదికగా అత్యాచారం చేస్తామని, దాడులకు పాల్పడతామని బెదిరింపులు రావడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. కేథరీనాపై మాదకద్రవ్యాల ముఠాలు సైతం బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో ఆమె ఆమ్‌స్టర్‌డామ్‌లో తన చదువును ఆపేసి, ఏడాది పాటు స్పెయిన్‌లో తలదాచుకోవాల్సి రావడం గమనార్హం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఖలిస్తాన్ తీవ్రవాదులను 'జాతీయ భద్రతా ముప్పు'గా ప్రకటించిన కెనడా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha