Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు గుట్టు రట్టు!

డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు గుట్టు రట్టు!

వార్త 2 weeks ago

Hyderabad ACB raids:హైదరాబాద్ ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నరహరి నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

Read also: Cricketer Yuzvendra Chahal:హైదరాబాద్‌లో క్రికెటర్ చాహల్ సందడి.. స్పోర్ట్స్ స్టార్టప్స్ కోసం 'స్ప్రింట్‌ఎక్స్' ప్రారంభం!

 ACB officials conducting raids in Hyd

అక్రమాస్తుల గుర్తింపు

సోదాల్లో ఏసీబీ అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. నరహరి ఇంట్లో భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. అత్తమామల పేర్ల మీద కూడా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ఆయన సంపాదించిన ఆస్తులు, అధికారిక ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ కొనసాగుతోంది.

Hyderabad ACB raids:11 చోట్ల ఏకకాలంలో తనిఖీలు

డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని మొత్తం 11 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. నరహరి అక్రమ సంపాదనకు సంబంధించి గతంలోనే ఏసీబీకి అనేక ఫిర్యాదులు అందాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, తగిన ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ ఆపరేషన్ చేపట్టారు. సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సెల్ఫీ వీడియో ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. 2 నెలల తర్వాత దొరికిన పసికందు ఆచూకీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha