Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దైవదర్శనం ముగించుకుని వస్తుండగా మృత్యుపాశం.. ఏడుగురు బలి!

దైవదర్శనం ముగించుకుని వస్తుండగా మృత్యుపాశం.. ఏడుగురు బలి!

వార్త 1 week ago

Karnataka road accident : కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దైవదర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని మృత్యువు కబళించింది.

టీబీ డ్యామ్ సమీపంలోని జాతీయ రహదారి 50పై అతివేగంగా వచ్చిన ఒక ట్యాంకర్, భక్తులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో పెను విషాదం నెలకొంది.

వంతెన పైనుంచి పడిపోయిన వాహనాలు

హుళిగెమ్మ ఆలయంలో పూజలు ముగించుకుని భక్తులు తమ స్వగ్రామానికి ట్రాక్టర్‌పై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టిన ధాటికి, రెండు వాహనాలు అదుపుతప్పి వంతెన పైనుంచి కింద పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దర్యాప్తులో వేగమే కారణమని గుర్తింపు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి (Karnataka road accident) చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ట్యాంకర్ డ్రైవర్ అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

చెన్నై ఐటీ హబ్‌లో భారీ మంటలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha