Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దంపతుల దారుణ హత్య.. పీరిల ఉదంతమే ప్రాణం తీసిందా..?

దంపతుల దారుణ హత్య.. పీరిల ఉదంతమే ప్రాణం తీసిందా..?

వార్త 2 weeks ago

Asifabad couple murder: ఆసిఫాబాద్ మండలంలోని కోసరా గ్రామ పంచాయితీలో గల భవాని నగర్ తాండలో భార్యభర్తల హత్య బుధవారం రాత్రి సంఘటన చోటుచేసుకున్నట్లు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేర్కొనడం జరిగింది.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బానోత్ రాజునాయక్ (50), సుశీల (45) బుధవారం రాత్రి ఇంటి ముందట పడుకున్న చోట హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. గతంలో కోసరాలో పీరిల ప్రతిమలు దొంగలించ బడ్డాయి. ఇదే సంఘటన పోలీస్ స్టేషన్లో సైతం కేసు నమోదు చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే గ్రామస్తులు రాజునాయక్ చందాలతో ఈసారి పీరిల ప్రతిమలు చేయించి బుధవారం రోజున కోసరాలోని పీరిల బంగ్లాలో ప్రతి ష్టాపించడం జరిగింది. గతంలో పీరిల ప్రతిమలు దొంగిలించిన ఆగంతకులు ఈసారి రాజునాయక్కు పీరిల దేవుడు రానుండడంతో ఆగంతకుల వివరాలు వెల్లడిస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఈ ఆగంతకానికి పాల్పడినట్లు మృతుల బంధువులు తెలిపారు. పథకం ప్రకారమే భార్య భర్తలను హత్య చేసినట్లు వారు అన్నారు.

Read Also: Ramanthapur Gold Chain Snatching:రామంతపూర్‌లో దొంగతనం..ఫేస్‌వాష్ అడిగినట్లు నటించి చోరీ!

 Brutal murder of a couple… Did the ‘Peeri’ incident claim their lives?

Asifabad couple murder: కరెంట్ తీసేసి అర్ధరాత్రి దారుణం.. పోలీసుల దర్యాప్తు

బుధవారం రాత్రి పీరిల బంగ్లా పూజ అనంతరం రాజునాయక్ ఇంటి వద్ద హాలులో భార్యభర్తలు నిద్రలో ఉపక్రమించడంతో అర్థరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి ఈ ఆగంతకానికి పాల్పడినట్లు కుమారులు సైతం ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఉదయం ఈ సంఘటన కలకలం రేపింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుమకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కొరకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కేసును ఆసిఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టెలిగ్రామ్ ద్వారా నకిలీ NEET-UG రీటెస్ట్ ప్రశ్నపత్రాలను విక్రయించిన విద్యార్థి అరెస్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha