Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డంపింగ్ యార్డ్ కాలుష్యంపై నిరాహార దీక్షకు సిద్ధం: మల్లారెడ్డి

డంపింగ్ యార్డ్ కాలుష్యంపై నిరాహార దీక్షకు సిద్ధం: మల్లారెడ్డి

వార్త 2 days ago

Jawaharnagar Dumping Yard: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన నియోజకవర్గ పరిధిలోని ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితిపై స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

జవహర్ నగర్ తన సొంత గుండెకాయ లాంటిదని, ఇక్కడి ప్రజల కష్టాలను చూస్తూ ఊరుకోలేనని ఆయన స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల తరఫున త్వరలోనే తాను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోనున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

అమెరికన్ యూనివర్సిటీ సర్వే నివేదికతో దిగ్భ్రాంతి

జవహర్ నగర్ ప్రాంతంలో నెలకొన్న కాలుష్య తీవ్రతపై ఇటీవల ఓ ప్రముఖ అమెరికన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ఫలితాలు తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేశాయని మల్లారెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మొత్తంలో మీథేన్ విషవాయువులను వెదజల్లుతున్న ప్రాంతాల జాబితాలో జవహర్ నగర్ నాల్గవ స్థానంలో నిలవడం అత్యంత ప్రమాదకర పరిణామమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలుష్య ప్రభావం వల్ల ఈ ప్రాంతంలో రోజువారీగా కనీసం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారని, అసలు వారి మరణాలకు గల అసలు కారణాలు ఎవరికీ అంతుచిక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Jawaharnagar Dumping Yard: రాంకీ సంస్థ నిర్లక్ష్యం.. కేంద్రంపై ఈటల రాజేందర్ ఒత్తిడి తేవాలి

2006 సంవత్సరంలో ప్రారంభమైన ఈ డంపింగ్ యార్డ్ నిర్వహణ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగించారని, ఆ సంస్థ వ్యవహరిస్తున్న తీరు మరియు పర్యవేక్షణా లోపాల వల్లే ఈ ప్రాంతం ఇప్పుడు ఒక పెద్ద విషవలయంగా మారిపోయిందని మల్లారెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. స్థానిక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. డంపింగ్ యార్డ్‌ను ఇక్కడి నుంచి పూర్తిగా తరలించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మల్లన్నసాగర్‌ను నింపి.. రైతులకు సాగునీరు అందించాలి - ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha