Dailyhunt
Dasun Shanaka: ప్రపంచకప్ నుంచి శ్రీలంక ఔట్.. కెప్టెన్ ఏమన్నారంటే?

Dasun Shanaka: ప్రపంచకప్ నుంచి శ్రీలంక ఔట్.. కెప్టెన్ ఏమన్నారంటే?

వార్త 1 month ago

Dasun Shanaka: టీ20 ప్రపంచకప్ సహ-ఆతిథ్య జట్టు శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో 61 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

ఈ పరాజయంతో శ్రీలంక సెమీఫైనల్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. సొంత గడ్డపై, వేలాది మంది అభిమానుల మధ్య జరిగిన ఈ ఓటమి లంక క్రికెట్ వర్గాల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది.

India vs Zimbabwe: టీమిండియాకు చావోరేవో: చెన్నై వేదికగా జింబాబ్వేతో కీలక పోరు!

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు సమర్పించుకుని లంక బౌలర్లు పట్టు విడిచారు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. కివీస్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర (4/27) దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

కెప్టెన్ షనక భావోద్వేగ వ్యాఖ్యలు: 'చాలా సిగ్గుగా ఉంది'

మ్యాచ్ అనంతరం కెప్టెన్ షనక మాట్లాడుతూ.. 'సొంత ప్రేక్షకుల మద్దతు ఉన్నా వారిని నిరాశపరచడం బాధగా ఉంది. మేము బౌలింగ్‌లో మంచి ఆరంభం పొందినా, శాంట్నర్-మెక్‌కోంచీ భాగస్వామ్యం మ్యాచ్‌ను మా నుంచి దూరం చేసింది. మా అగ్రశ్రేణి బ్యాటర్లు బాధ్యత తీసుకోవడంలో విఫలమయ్యారు. టీ20 క్రికెట్‌లో దూకుడుగా ఆడాలి. ఆ ప్రయత్నంలో ఔటైనా ఫర్వాలేదు, కానీ మా వాళ్లు ఆ సాహసం చేయలేదు' అని విశ్లేషించాడు.

పిచ్ కొత్తది కావడంతో ఇంతగా టర్న్ అవుతుందని ఊహించలేదని, అయితే న్యూజిలాండ్ బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు వేసి తమను కట్టడి చేశారని షనక అంగీకరించాడు. టోర్నీలో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉందని, కనీసం ఆ మ్యాచ్‌లోనైనా గెలిచి గౌరవంగా ముగించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Cricket History SL legends : టీ20 వరల్డ్ కప్ నుంచి లంక ఔట్, అభిమానులు పాత విజయాలను గుర్తుచేసుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha