Heatwave: భారతదేశంలో విపరీతమైన ఎండ వేడిమి పెరుగుదల మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతోంది. ప్రపంచంలో అత్యంత వేడిగా ఉన్న 50 నగరాల్లో 26 మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలు దేశంలోని కోట్ల మంది కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. ఎండల తీవ్రత కారణంగా శ్రామిక శక్తి పనితీరు నెమ్మదించి ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
Weather updates: నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్
The sun’s claw on the country’s economy
దేశాన్ని వణికిస్తున్న ఉష్ణోగ్రతలు ముప్పు
మన దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 75 శాతం మంది ఎండ వేడికి గురయ్యే రంగాల్లోనే శ్రమిస్తున్నారు. రాబోయే 2030 నాటికి వేడి కారణంగా 3.4 కోట్ల ఉద్యోగాలకు సమానమైన పని సామర్థ్యం కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. బయట ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు రోజువారీ ఉపాధి కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పేదరికం పెరిగే అవకాశం ఉంది.
Heatwave: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ఈ ముప్పును ముందే గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వడగాల్పులను ప్రత్యేక విపత్తుగా అధికారికంగా ప్రకటించింది. కార్మికులను ఆదుకోవడానికి పరిహార మొత్తాన్ని కూడా పెంచడం జరిగింది. ఎండ తీవ్రత నుంచి శ్రామికులను రక్షించడానికి ప్రభుత్వాలు, యాజమాన్యాలు తగిన నీటి వసతులు, విశ్రాంతి సమయాలు కల్పించాలి.
Epaper: epaper.vaartha.com

