India, America : భారతదేశం చరిత్రాత్మకంగా అలీన విధానంలో కీలక పాత్ర పోషించింది. కానీ ప్రస్తుతం అమెరికా వైపు వాలుతున్నది, ఈ పరిణామాలు సమతుల్యత నుంచి ఒకవైపు వాలడం' సూచిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి.
ఒకప్పుడు భారత్ అలీన దేశాలకు నాయకత్వం వహించి ప్రపంచానికే శాంతి దేశంగా, మధ్యవర్తిత్వం వహించే విధంగా ఉండేది. కానీ ప్రస్తుతం మన దేశ పరువు ప్రపంచ దేశాలతో ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు మాటలు, మన విదేశీ వ్యవహారాల దగ్గర పరువుపోతోంది. భారత విదేశాంగ-విధానం ప్రస్తుతం మారుతున్న దిశలో వుంది. భారత్ను నరకంతో పోల్చడంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఆ కథనాలను చూశాము వాటిని అక్కడితో వదిలేస్తున్నామని చెప్పారు. ఇది సరైన సమాధానమేనా. ట్రంపు మాటమాటకి మా మిత్రుడు అనిచెప్పే ప్రధాని, ట్రంప్కి సమాధానం చెప్ప లేదా లేదా నోరు రాదా? 2014 కు ముందు మన్మోహన్ సింగ్ను మౌనముని అని ప్రతిసారి విమర్శించిన ప్రధాని ఇప్పుడు మూగముని అయ్యాడని తెలుస్తోంది.
Read Also: Meta CEO Zuckerberg: మరిన్ని ఉద్యోగ కోతలపై మెటా సీఈఓ జుకర్‌బర్గ్ మౌనం
India, America
India, America : చేతగానితనం
భారతదేశం ప్రపంచ శక్తులతో భాగస్వామ్యం చేస్తుందా? లేక వాటి ప్రభావం వల్ల నడుస్తుందా? అనేది కేవలం విమర్శ కాదు, ఒక దేశ భవిష్యత్తుపై ఆలోచనను రేకెత్తిస్తోంది. ప్రధాని విదేశీ పర్యటనలలో భారత్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు లేదా విదేశీ నేతలు భారత్ను అవమానించినప్పుడు ఆయన మౌనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ప్రతిపక్షాలు విమర్శకులు ప్రధాని ‘దేశభక్తి’ని ప్రశ్నిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ వంటి విదేశీ నేతలు భారత దేశంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు, ప్రధాని మౌనంగా ఉన్నారని, ఇది దేశ బలహీనతకు సంకేతమని, చేతగానితనంగా ప్రపంచ దేశాల మధ్య నిలుపుతున్నారు. ప్రపంచ
వేదికలపై భారతదేశానికి గుర్తింపు పెరిగిందని, మోదీ పాలనలో దేశం ‘విశ్వగురువు’గా ఎదుగుతోందని కేంద్రనాయకులు వాదిస్తారు. భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరినప్పుడు, తన జోక్యంతోనే ఆపరేషన్ సిందూర్ ముగిసిందని, తద్వారా భారీ ప్రాణ నష్టాన్ని తప్పించానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. వీటిపై ప్రధాని నోరుమెదపలేదు. విదేశీ నేతల వ్యాఖ్యలపై మౌనం అనేది కొన్నిసార్లు దౌత్యపరమైన వ్యూహంకావచ్చు లేదా వాణిజ్య లేదా భౌగోళిక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం కావచ్చు. కానీ ఒక దేశాన్ని మాటమాటకి అగౌరపరచి మాట్లాడడం, దానికి ప్రధాని మౌనం వహిం చడం దేశ కీర్తికి మంచిదికాదు.
సంబంధాల్లో అసమానత
అమెరికా పర్యటనలో ఒక అధికార పార్టీకి చెందిన రామ్ మాధవ్ వంటి కీలక నాయకుడు ఆషామాషీ కాడు, పార్టీ వ్యూహకర్త మేము మీరు చెప్పిన అన్నింటికి ఒప్పుకున్నాము కదా … రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించాము, మీరు వేసిన 50 పన్నులకు ఒప్పుకున్నాము, ఆయుధాలు మీ దగ్గరే కొన్నా ము ఇలా మేము అన్నీ చేశాం, ఇంకా ఎందుకు ఒత్తిడి? అనే భావనను రామ్ మాధవ్ వెలిబుచ్చడం ఒక విధంగా అమెరికా భారత్ సంబంధాల్లో అసమానతను సూచిస్తావుం ది. అంటే ఇది కేవలం భారత ప్రభుత్వంపై విమర్శ మాత్ర మే కాదు, అంతర్జాతీయ సంబంధాల అసమానతపైకూడా ఎలా ఉందో తెలుస్తోంది. ఇది స్వతంత్ర విదేశాంగ విధా నంపై సందేహాన్ని. కలిగిస్తోంది. ఈ భరింపులు ఎవరికోసం దేశం కోసమా లేక వ్యక్తిగత పరువు కోసమా లేక కార్పొ రేట్ల కోసమా అనేది ప్రధాని సెలవివ్వాలి. దేశీయ నిర్ణయా లపై బాహ్య ప్రభావం ఉందా?అనే ప్రశ్న ప్రభుత్వం ప్రచా రం చేసే ఆత్మనిర్భర్ భారత్కు ముమ్మాటికీ వ్యతిరేక సంకే తమే.
India, America
విదేశాలపై ఆధార పడటం
1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకి స్థాన్కుమద్దతుగా భారతన్ను హెచ్చరించారు. అయితే ఇందిరా గాంధీ ఏమాత్రం భయపడకుండా అమెరికా మాకు యజమాని కాదు అని ముఖంమీదే స్పష్టంచేశారు. అమెరికా బెదిరింపులకు ఆమె తలొగ్గలేదు. అమెరికా వెళ్ళినప్పుడు, నిక్సన్ ఆమెను తక్కువ చేసి మాట్లాడినా ఆమె హుందా గా, ధైర్యంగా సమాధానమిచ్చారు. మేక్ ఇన్ ఇండియా నినాదం ఉన్నప్పటికీ, రక్షణ రంగంలో విదేశాలపై ఆధార పడటం పెరిగింది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులకు అధిక ప్రాధాన్యతనివ్వడం, కార్పొరేట్ అనుకూల విధానాలు పాటిం చడం ప్రజా రంగసంస్థలను ప్రైవేటీకరణ చేయడం కూడా విదేశీ ప్రమేయమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. స్వతం త్రతను కోల్పోవడం ప్రమాదకరం, విదేశీ జోక్యం పెరగడం, దేశ ప్రయోజనాలు పక్కన పడే ప్రమాదం వుంది. స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇటువంటి ప్రధాని లేరని భవిష్యత్తులో చరిత్రే సమాధానంచెబుతుంది.
-డాక్టర్ ఎ. భాగ్యరాజ్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
అరబ్ దేశాల సాయంతోనే అమెరికా-ఇజ్రాయెల్ దాడులు..UNOకి ఇరాన్ లేఖ

