Revanth Reddy: అణచివేత, దోపిడి మరియు పరాయిపాలనలో దీర్ఘకాలంగా మగ్గిపోతున్న దేశానికి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చారిత్రాత్మక విముక్తి కల్పించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలను అందించడంతో పాటు దేశ భవిష్యత్తుకు బలమైన బాటలు వేసింది కాంగ్రెస్సన్నే ఆయన గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పార్టీ చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

అంబేద్కర్ రాజ్యాంగమే దేశానికి రక్షణ
భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశం అన్ని రంగాల్లో బలంగా ఎదగడానికి, ప్రజల హక్కులను పరిరక్షించడానికి అత్యంత ముఖ్యమైన ఆధారమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థను వేళ్లూనుకునేలా చేయడంలో రాజ్యాంగ పాత్ర అనన్యసామాన్యమని ఆయన వెల్లడించారు.
Revanth Reddy: ప్రజలకు నమ్మకం, భరోసా కాంగ్రెస్
దేశ ప్రజలందరికీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నమ్మకం మరియు భరోసా అనే భావనను ప్రజల్లో కలిగించిందని ఆయన తెలిపారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలనే తోసేశారు.. బీఆర్ఎస్‌పై సీతక్క సంచలన ఆరోపణలు

