Rains In India South West Monsoon : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరియు క్రియాశీలక రుతుపవన ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ (కోస్తాంధ్ర, రాయలసీమ), తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ ప్రాంతాల్లో సెప్టెంబర్ మొదటి వారం అంతా అక్కడక్కడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
Read Also: Tamilanadu : స్టాలిన్ కు సెక్యూరిటీని తగ్గించిన విజయ్ సర్కార్
Rains In India South West Monsoon
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ వంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడటంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశముందని అధికారులు అప్రమత్తం చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
Rains In India South West Monsoon :ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వానలే
ఈశాన్య భారత్‌లో కూడా రానున్న రోజుల్లో తడి వాతావరణం కొనసాగనుంది. అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపురలో విస్తారంగా వర్శాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య మహారాష్ట్రలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వానలు పడొచ్చు. కొన్ని ప్రాంతాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. అయితే గుజరాత్‌లో వర్షపాతం మాత్రం అసమానంగా ఉంది. రాష్ట్రంలోని 34 జిల్లాల్లో 11 జిల్లాలు దాదాపు 50 నుంచి 51 శాతం వర్షపాతం లోటును ఎదుర్కొంటున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, శ్రీలంక పరిసరాలు, అండమాన్ సముద్రం, పశ్చిమ బంగాల్ తీర ప్రాంతాల్లో అలలు ఉధృతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడిపై 'పిల్' తిరస్కరించిన సుప్రీంకోర్టు!

