Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశంలోనే ఫస్ట్ ఘనత ఏపీకి దక్కింది

దేశంలోనే ఫస్ట్ ఘనత ఏపీకి దక్కింది

వార్త 3 weeks ago

Quantum-AI University : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్-ఏఐ (Quantum-AI) యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) ఆధ్వర్యంలో సుమారు 8.5 ఎకరాల విస్తీర్ణంలో రూ. 730 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం 100% గ్రాంట్-ఇన్-ఎయిడ్ (Grant-in-Aid) నిధుల రూపంలో పూర్తిగా సమకూరుస్తుండటం విశేషం. ఈ యూనివర్సిటీ ఏర్పాటుతో ఏపీ అంతర్జాతీయ సాంకేతిక పటంలో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోనుంది.

ఆచార్య నాగార్జున వర్సిటీలో క్లాసులు ప్రారంభం: వేగంగా అడుగులు

యూనివర్సిటీకి సంబంధించిన సొంత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు విద్యాబోధనకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబరు 13 నుంచే గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక ప్రాంగణంలో NIELIT క్లాసులను ప్రారంభించనున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యంత ఆధునిక సాంకేతిక అంశాలపై పరిశోధనలు, శిక్షణ అందించడం ద్వారా దేశ విదేశాల్లోని ప్రముఖ ఐటీ సంస్థలకు అవసరమైన నిపుణులను ఇక్కడ తయారు చేయనున్నారు. ఈ చొరవతో ఆంధ్రప్రదేశ్ యువతకు విస్తృతమైన ఉద్యోగ, పరిశోధనా అవకాశాలు లభించనున్నాయి.

కాకినాడలో దారుణం: వివాహేతర సంబంధం కారణంగా జిమ్ ట్రైనర్ కిరాతక హత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha