డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
Telangana Audit Department: ఆన్లైన్ ఆడిటింగ్ లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
వరుసగా గత మూడుసార్లు దేశంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించిందని తెలిపారు. హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం రాష్ట్రంలో ఆన్ లైన్ ఆడిటింగ్ వ్యవస్థను పరిశీలించేందుకు వచ్చిన గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అత్యంత బలంగా ఉన్నాయన్నారు.
Read Also: Smartphone Electricity Billing: ఇక స్మార్ట్‌ఫోన్‌తోనే కరెంట్ బిల్లుల జారీ!
Gujarat officials meet with Bhatti Vikramarka
Telangana Audit Department: అధ్యయనానికి పూర్తి సహకారం
తెలంగాణ లో ఆడిట్ శాఖ పనితీరు అధ్యయనానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి అధికారులు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. గుజరాత్ అధికారులు స్పందిస్తూ గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామపంచాయతీలను సందర్శించి ఆన్లైన్ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో ఆడిటింగ్ వ్యవస్థ పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని కితాబునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

