భారత ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్షానలో భాగంగా (ECI) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Interactive Revision - SIR) మూడో దశకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ మే 30 నుండి ప్రారంభం కానుంది. ఈ మూడో దశలో భాగంగా ఎన్నికల సంఘం భారీ కసరత్తు చేస్తోంది. సుమారు 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించనున్నారు. వీరు స్వయంగా ఇంటింటికీ వెళ్లి దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను స్వయంగా పరిశీలించనున్నారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దడం, మరణించిన లేదా చిరునామా మారిన వారి పేర్లను తొలగించడం మరియు అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యం.
Read Also: VD Satheesan: కేరళ సీఎంగా సతీషన్ ఖరారు
SIR
SIR: అమలు కానున్న రాష్ట్రాలు, ప్రాంతాలు
ఈ ప్రక్రియ ఢిల్లీ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి ప్రధాన రాష్ట్రాలతో పాటు మొత్తం 19 ప్రాంతాల్లో అమలు కానుంది. అయితే, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్ వంటి మంచు ప్రభావిత ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి మరియు ఏవైనా మార్పులు ఉంటే BLOలకు తెలియజేయడానికి ఇది మంచి అవకాశం. మే 30 నుండి మీ ప్రాంతంలో BLOలు పర్యటించే సమయంలో అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం ఉత్తమం.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఎర్రకోట కేసులో ఎన్ఐఏ భారీ స్కెచ్.. 10 మంది నిందితులు, 7500 పేజీల చిట్టా!

