Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల. రూ.6 కోట్లు వసూళ్లు

డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల. రూ.6 కోట్లు వసూళ్లు

వార్త 2 weeks ago

Dating app : ఉత్తరప్రదేశ్ (UP) లో డేటింగ్ యాప్‌ను ఆసరాగా చేసుకుని విలాసవంతమైన జీవితం కోసం పురుషులను బురిడీ కొట్టించిన ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

పల్లవి సింగ్ అనే యువతి ప్రముఖ డేటింగ్ యాప్‌లలో అందమైన ఫోటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, అమాయక పురుషులకు వల వేసేది. మాటలతో వారిని ఆకర్షించి, దగ్గరైన తర్వాత సదరు బాధితులతో జరిపిన సంభాషణలు, వీడియో కాల్స్ మరియు ఫోటోలను రహస్యంగా రికార్డు చేసేది. అనంతరం ఆ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలతో బాధితులను తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ.6 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సమాజంలో పరువు పోతుందనే భయంతో పలువురు బాధితులు ఆమె డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించి ఊరుకున్నారు.

హైకోర్టు లాయర్ ఫిర్యాదుతో బయటపడ్డ నెట్‌వర్క్: ఎదురుతిరిగితే తప్పుడు కేసులు!

ఈ మోసపూరిత దందాలో ఆమె నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ఒక హైకోర్టు న్యాయవాది ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిలేడీ భాగోతం బయటపడింది. ఎవరైనా ఆమె బెదిరింపులకు లొంగకుండా ఎదురుతిరిగితే, వారిపై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి జైలుకు పంపేంతటి కుట్రలకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు పల్లవి సింగ్ అరెస్టుకు చర్యలు చేపడుతూ, ఈ దోపిడీ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరైనా భాగస్వాములు ఉన్నారా అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha