దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయ ట్రస్టులు, వివిధ మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోందంటూ సోషల్ మీడియాలో షేరవుతున్న వార్తలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది.
దేవాలయాల బంగారంపై ‘గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్’ (Gold Monetisation Scheme) తీసుకురావాలని కేంద్రం యోచిస్తోందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
Read Also: SBI Bank Holidays: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్?
Gold Monetisation Scheme
Gold Monetisation Scheme: సోషల్ మీడియా ప్రచారం పూర్తిగా నిరాధారం
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దేవాలయాల బంగారం మరియు గోల్డ్ బాండ్లకు సంబంధించి కొన్ని నివేదికలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పోస్టులు పూర్తిగా అబద్ధం అని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మరియు ఎలాంటి ఆధారం లేకుండా సృష్టించినవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దేవాలయాల వద్ద ఉన్న బంగారు నిల్వలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ‘గోల్డ్ బాండ్లను’ జారీ చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇది ముమ్మాటికీ తప్పుడు కథనం. ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదు. ఇలాంటి వదంతులను, ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం కోరింది. ధ్రువీకరించని సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేయడం వల్ల సమాజంలో అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని, ప్రజలు తప్పుదోవన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. విధానపరమైన నిర్ణయాలు, కొత్త ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారమైనా సరే.. కేవలం ప్రభుత్వ అధికారిక పత్రికా ప్రకటనలు (ప్రెస్ రిలీజ్లు), అధికారిక గవర్నమెంట్ వెబ్సైట్లు, ధ్రువీకరించిన పబ్లిక్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మాత్రమే వెల్లడిస్తామని, వాటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వశాఖ సూచించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

