Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Devarapalli Crime News: నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అమానుషం

Devarapalli Crime News: నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అమానుషం

వార్త 3 months ago

Devarapalli Crime News: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వం మంటగలిసేలా ఓ 70 ఏళ్ల వృద్ధుడు కేవలం నాలుగేళ్ల పసిప్రాయం కలిగిన చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దేహశుద్ధి చేసిన స్థానికులు

నిందితుడి అమానుష చర్యను గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టుకుని బంధించారు. ఆగ్రహంతో నిందితుడికి తీవ్రంగా దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గోపాలపురం మండలం గోపవరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పొగాకు బ్యారన్ క్యూరింగ్ పనుల నిమిత్తం ఇటీవల దేవరపల్లికి కూలీగా వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు.

Devarapalli Crime News: వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి బాలిక

నిందితుడి దాడిలో అస్వస్థతకు గురైన చిన్నారిని చికిత్స మరియు వైద్య పరీక్షల నిమిత్తం వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha