Devi - Sukku : టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) జంట ఒకటి. సుకుమార్ మొదటి చిత్రం 'ఆర్య' నుంచి నిన్నమొన్నటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'పుష్ప-2' వరకు ప్రతీ సినిమాకూ దేవిశ్రీ ప్రసాదే స్వరాలు సమకూర్చారు.
అయితే, ఇప్పుడు వీళ్లద్దరి కాంబోకి బ్రేక్ పడనుందనే వార్తలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించనున్న ‘RC17’ ప్రాజెక్ట్ కోసం DSPని కాదని, ‘ధురంధర్’ చిత్రంతో ఆకట్టుకున్న బాలీవుడ్ సంగీత దర్శకుడు శాశ్వత్ సన్దేవ్ (Shashwat Sachdev) పేరును పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ నిర్ణయం వెనుక కథా నేపథ్యం లేదా పాన్ ఇండియా అప్పీల్ కోసమే సుక్కు కొత్త ప్రయోగం వైపు మొగ్గు చూపుతున్నారా అనే దానిపై త్వరలోనే అధికారిక క్లారిటీ రానుంది.

నటుడిగా మారుతున్న దేవి - ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీ
మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ కూడా కేవలం సంగీతానికే పరిమితం కాకుండా తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ‘ఎల్లమ్మ’ అనే చిత్రంతో ఆయన నటుడిగా అవతారమెత్తుతుండడం గమనార్హం. ప్రస్తుతం నటనతో పాటు ‘KING100’, కార్తీ 30వ సినిమా వంటి భారీ ప్రాజెక్ట్‌లకు మ్యూజిక్ అందిస్తూ డ్యూయల్ రోల్‌లో బిజీగా ఉన్నారు. సుకుమార్ ప్రాజెక్ట్ నుంచి ఈ మార్పు వార్తలు అభిమానులను కొంత ఆశ్చర్యపరిచినప్పటికీ, కొత్త రకమైన సంగీతాన్ని శ్రోతలకు అందించడానికే దర్శక-నిర్మాతలు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'దొంగ నా కొడుకు'.. మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమా

