Dailyhunt
దెయ్యం వర్సెస్ పిచ్చివాళ్ల క్రేజీ కామెడీ.. 'ఓం శాంతి డిస్కో శాంతి' విడుదల

దెయ్యం వర్సెస్ పిచ్చివాళ్ల క్రేజీ కామెడీ.. 'ఓం శాంతి డిస్కో శాంతి' విడుదల

వార్త 1 week ago

Om Shanti Disco Shanti Movie: టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మేకర్ మహి వి. రాఘవ్. యాత్ర, పాఠశాల వంటి ఎమోషనల్ చిత్రాలతో పాటు ఆనందో బ్రహ్మతో హారర్ కామెడీలో కొత్త ఒరవడి సృష్టించిన ఆయన, ఇప్పుడు మరో క్రేజీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఆయన షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఓం శాంతి డిస్కో శాంతి'. దీనికి ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ అనే వెరైటీ క్యాప్షన్ జత చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యాలు మనుషులను భయపెట్టడం చూస్తుంటాం. కానీ, ఓం శాంతి డిస్కో శాంతి లో కథ వెరైటీగా ఉండబోతోంది. భయం అంటే ఏంటో తెలియని కొందరు పిచ్చివాళ్లు ఒక దెయ్యం ఉన్న చోటికి వెళ్తే ఎలా ఉంటుంది? ఆ దెయ్యమే వారిని చూసి భయపడితే పరిస్థితి ఏంటి? అనే అంశం చుట్టూ ఈ సినిమా సాగనుంది. దెయ్యాలకే చెమటలు పట్టించే పిచ్చివాళ్ల కామెడీ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుందని మేకర్స్ భరోసా ఇస్తున్నారు.

Read Also: Hyderabad Hubli Flight:విమానంలో సాంకేతిక లోపం: గాల్లో 4 గంటల టెన్షన్..

Om Shanti Disco Shanti Movie: సాంకేతిక నిపుణులు, నిర్మాణం

ఈ చిత్రానికి గోగు ఆర్.ఆర్. దర్శకత్వం వహిస్తుండగా, మహి వి. రాఘవ్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై శివ మేక, సాహితి చింతలపూడి నిర్మిస్తున్నారు. కృష్ణ కుమార్ సంగీతం అందిస్తుండగా, జ్ఞానశేఖర్ వి.ఎస్. విజువల్స్ అందిస్తున్నారు. మహి వి. రాఘవ్ గతంలో అందించిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో, ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ అనే క్యాప్షన్ సినిమా పబ్లిసిటీకి ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రిలీజ్ డేట్ ఖరారు

హారర్ ఎలిమెంట్స్‌కు ఫన్నీ డైలాగులు, ఊహించని ట్విస్టులు జోడించి రూపొందిస్తున్న ఈ స్పూకీ ఫన్ జర్నీ సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో సందడి చేయబోతోంది. హారర్ కామెడీ జోనర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు 'ఓం శాంతి డిస్కో శాంతి' ఒక పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మోదీ మహిళా బిల్లును అడ్డుకున్నారు, ప్రతిపక్షం కేవలం డీలిమిటేషన్‌పైనే పోరాడింది: ఖర్గే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha