Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధనుష్‌ కొత్త పార్టీ 'తమిళగ ఎళుచ్చి కళగం'?

ధనుష్‌ కొత్త పార్టీ 'తమిళగ ఎళుచ్చి కళగం'?

వార్త 2 weeks ago

Dhanush Political Entry: తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ హీరో పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగా..

తాజాగా ప్రముఖ నటుడు ధనుష్ కూడా పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

ధనుష్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారనే వార్తలు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. 'తమిళగ ఎళుచ్చి కళగం' పేరుతో పార్టీని ప్రారంభించే అవకాశం ఉందంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై ధనుష్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల అభిమానులతో నిర్వహించిన కార్యక్రమంలో ధనుష్.. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింతగా చేపట్టాలని సూచించారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మరింత పెరిగాయి.

Read Also : Rahul Gandhi: రాహుల్‌ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు

 Dhanush's new party 'Tamizhaga Ezhuchi Kazhagam'?

ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీ పేరు రిజిస్ట్రేషన్?

ధనుష్ ఇప్పటికే 'తమిళగ ఎళుచ్చి కళగం' అనే పేరును భారత ఎన్నికల సంఘం (ECI) వద్ద రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఆయన నుంచి ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్ని నెలలుగా ధనుష్ తన అభిమాన సంఘాలను మరింత బలోపేతం చేయడం, వాటి ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ఉధృతం చేయడం, అలాగే ఇటీవల ఫ్యాన్ క్లబ్స్ కోసం ప్రత్యేకంగా ఒక జెండాను ఆవిష్కరించడం వంటి పరిణామాలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

Dhanush Political Entry: అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు!

అయితే, ఈ రాజకీయ ప్రవేశం మరియు పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌పై ధనుష్ నుంచి గానీ, ఆయన అధికారిక బృందం నుంచి గానీ ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ కూడా తమిళ మీడియా వర్గాల సమాచారం ఆధారంగా వస్తున్న ఊహాగానాలే. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే ధనుష్ స్వయంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

UPI మర్చంట్ అకౌంట్లను ట్రాక్ చేయనున్న కేంద్రం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha