Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధనుష్, మమిత బైజు 'కర' సినిమా టాక్ ఎలా ఉందంటే?

ధనుష్, మమిత బైజు 'కర' సినిమా టాక్ ఎలా ఉందంటే?

వార్త 3 weeks ago

Kara Movie Review: తమిళ స్టార్ హీరో ధనుష్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం 'కర'. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (ఏప్రిల్ 30, 2026) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Read Also:Raaka : అల్లు అర్జున్ 'రాకా' కు భారీ డిమాండ్

కథా సారాంశం

కరస్వామి (ధనుష్) ఒక దొంగ. తన చివరి దొంగతనం పూర్తి చేసి ఆ వృత్తికి స్వస్తి చెప్పాలనుకుంటాడు.ఒక దొంగతనంలో స్నేహితుడు వదిలేసి వెళ్ళడంతో పోలీసులకు దొరికిపోతాడు. తన రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న డీఎస్పీ భరతన్ (సూరజ్ వెంజర్మూడు), పేరు సంపాదించుకోవడానికి కరపై లేనిపోని కేసులు పెట్టి వేధిస్తాడు.

పోలీసుల నుంచి తప్పించుకున్న కర, మల్లి (మమిత బైజు)ని పెళ్లి చేసుకుని దూరంగా హోటల్‌లో పనిచేస్తూ ఉంటాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సొంత హోటల్ పెట్టాలనుకుని 16 ఏళ్ల తర్వాత తన ఊరికి వెళ్తాడు.అక్కడ తన తండ్రి (కేఎస్ రవికుమార్) అప్పుల్లో ఉన్నాడని, పొలం తాకట్టులో ఉందని తెలుస్తుంది. తండ్రి మరణించాక, ఆయన కోరిక మేరకు పొలంలో పూడ్చిపెట్టడానికి బ్యాంకు నిబంధనలు అడ్డువస్తాయి.ఆ తరువాత ఏం జరిగిందనేది కథ.

Kara Movie Review: సినిమా విశ్లేషణ

ఫస్ట్ హాఫ్ నిదానంగా ధనుష్ పాత్ర పరిచయం, తండ్రి ఎమోషన్‌తో సాగుతుంది. అయితే ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంక్ దొంగతనం సీన్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.సెకండ్ హాఫ్ సస్పెన్స్, బ్యాంక్ దొంగతనాలు మరియు రైతుల ఎమోషన్‌తో ముగుస్తుంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం స్క్రీన్ ప్లే వేగంగా ఉంటుంది.కర ఫ్లాష్ బ్యాక్, మమిత బైజుతో ప్రేమకథ గురించి సరైన స్పష్టత లేదు.

నటీనటుల ప్రదర్శన

  • ధనుష్: తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో రాణించారు.
  • సూరజ్ వెంజర్మూడు: డీఎస్పీ భరతన్ పాత్రలో తనదైన ముద్ర వేశారు.
  • కేఎస్ రవికుమార్: తండ్రి పాత్రలో ఒదిగిపోయి సెంటిమెంట్‌ను పండించారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha