Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధర్మేంద్ర ప్రధాన్.. నెక్స్ట్ ఏంటి?

ధర్మేంద్ర ప్రధాన్.. నెక్స్ట్ ఏంటి?

వార్త 4 days ago

Dharmendra Pradhan : కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మికంగా రాజీనామా చేయడం జాతీయ రాజకీయాల్లోనే కాకుండా ఆయన సొంత రాష్ట్రమైన ఒడిశాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పడుతూ ఘనస్వాగతం పలకడం సాధారణ పరిణామం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రిపదవిని వీడినప్పటికీ, రాష్ట్రంలో ఆయన పట్ల వ్యక్తమైన ఈ విపరీతమైన ఆదరణ ఒడిశా రాజకీయాల్లో ఆయన పునరాగమనానికి స్పష్టమైన సంకేతాలనిస్తోంది. కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం కలిగిన నాయకుడు కావడంతో, ఆయన ఒడిశా రాజకీయాలవైపు దృష్టి సారించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే ప్రచారం సాగుతోంది.

రాబోయే రోజుల్లో CM పాత్ర? స్థానిక నాయకత్వంలో అలజడి!

ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం స్థిరపడిన ప్రస్తుత తరుణంలో, అధిష్ఠానం ధర్మేంద్ర ప్రధాన్‌కు రాష్ట్ర స్థాయిలో మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే వార్తలు స్థానిక నేతల్లో కలవరాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో ఆయనకు ముఖ్యమంత్రి (CM) బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఒడిశా అధికార పక్షంలోని ప్రస్తుత సీనియర్ నాయకులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. నవీన్ పట్నాయక్ శకం తర్వాత బిజెపిని రాష్ట్రంలో సుదీర్ఘకాలం బలోపేతం చేయాలంటే ప్రధాన్ లాంటి మాస్ లీడర్ అవసరమని హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ, ఒడిశాలో ఆయన తదుపరి రాజకీయాంకానికి సంబంధించి బీజేపీ అధిష్ఠానం తీసుకోబోయే అంతిమ నిర్ణయంపైనే స్థానిక నాయకుల భవిష్యత్తు మరియు రాష్ట్ర రాజకీయాల దిశానిర్దేశం ఆధారపడి ఉన్నాయి.

కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి.. 12 జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha