Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: అభిజీత్ దీప్కే

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: అభిజీత్ దీప్కే

వార్త 2 months ago

Abhijeet Deepke: దేశ విద్యావ్యవస్థ తీరుపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాబోయే ఏడు రోజుల్లోగా మంత్రి గద్దె దిగకపోతే, దేశవ్యాప్తంగా నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఘాటుగా హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

Read also:Tata Motors EV offers: జూన్ నెలలో టాటా ఈవీలపై రూ.3.35 లక్షల భారీ తగ్గింపు!

జంతర్ మంతర్ నిరసన కేవలం ట్రైలర్ మాత్రమే.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో తదుపరి కార్యాచరణ!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తాము నిర్వహించిన శాంతియుత ఆందోళన ఒక చారిత్రాత్మక ఘట్టమని అభిజీత్ దీప్కే అభివర్ణించారు. “సామాన్యులు (బొద్దింకలు) అంతా ఏకమైతే ఎలాంటి ప్రకంపనలు సృష్టించవచ్చో ప్రభుత్వానికి చూపించిన ఒక చిన్న ట్రైలర్ మాత్రమే ఇది” అని ఆయన వ్యాఖ్యానించారు. నిరసనలో పాల్గొన్న వారిలో అత్యధికులు మొదటిసారి రోడ్లపైకి వచ్చినవారే అయినప్పటికీ, విద్యావ్యవస్థపై ఉన్న నిరాశ, ఆక్రోశంతోనే ధైర్యంగా ముందుకు వచ్చారని పేర్కొన్నారు.

ఢిల్లీలో ఉన్న తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో భాగస్వాములైన యువతకు, విద్యార్థులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాంతియుత పోరాటమే తమ అతిపెద్ద ఆయుధమని, ఐక్యంగా సాగే ఉద్యమాలను ఏ శక్తీ అణచలేదని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి ఒక పూర్తి తరానికి అన్యాయం చేశారని, ఈ పోరాటం ఇక్కడితో ఆగదని తేల్చిచెప్పారు. తదుపరి యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేసేందుకు ఈరోజు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లైవ్ ద్వారా అనుచరులతో మాట్లాడనున్నట్లు దీప్కే వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

ప్రధాని మోదీ ఇచ్చిన వజ్రాన్ని వెనక్కి ఇచ్చేశా.. జిల్ బైడెన్ ఆత్మకథలో సంచలన విషయాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha