Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"ఢిల్లీ కోటపై దండెత్తుతా!" అన్న మమతా బెనర్జీ.. అమిత్ షా స్పందన ఇదే!

"ఢిల్లీ కోటపై దండెత్తుతా!" అన్న మమతా బెనర్జీ.. అమిత్ షా స్పందన ఇదే!

వార్త 2 months ago

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ఏప్రిల్ 24న చౌరింగీలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగం ఆద్యంతం ఆవేశపూరితంగా సాగింది.

ప్రత్యర్థులను ఉద్దేశించి ఆమె చేసిన "నన్ను ఓడించే సత్తా మీకు లేదు" అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బెంగాల్ విజయం కేవలం ప్రారంభం మాత్రమేనని, తన అసలు లక్ష్యం ఢిల్లీ కోటను దక్కించుకోవడమేనని ఆమె స్పష్టం చేశారు.

Read Also: Guwahati High Court: పవన్ ఖేరాకు షాక్..బెయిల్‌ను నిరాకరించిన గౌహతి హైకోర్టు

Mamata Banerjee: "నా డైరీలో అందరి పేర్లు ఉన్నాయి".. అధికారులకు దీదీ హెచ్చరిక

బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులపై మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "A టూ Z" వరకు ఎవరెవరు బీజేపీ కోసం లోపాయికారీగా వ్యవహరిస్తున్నారో వారి వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని ఆమె హెచ్చరించారు. "మీరు మమ్మల్ని గమనిస్తున్నారని అనుకోకండి, మీ ప్రతి కదలికపై నా నిఘా ఉంది" అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. దీదీ వ్యాఖ్యలపై స్పందన గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. 'ఇక్కడే ఏం మిగలదు, ఇక ఆమె ఢిల్లీకి ఎలా వస్తారు? నేనేం చెప్పగలను' అని నవ్వేశారు. కాగా మమత తన ప్రచారంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీకి పనిచేసే వారి అందరి పేర్లూ నోట్ చేసుకున్నానని తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Raghav Chadha joins BJP: ఆప్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చడ్డా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha