Delhi School Fees: ఢిల్లీలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల ఫీజుల వసూలుపై డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DoE) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ ప్రైవేట్ స్కూల్ కూడా తల్లిదండ్రులను ఒక నెల కంటే ఎక్కువ ఫీజును (త్రైమాసిక లేదా అర్ధవార్షిక) ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేసింది.
Read Also: Emergency Alert System:దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఫోన్లకు వచ్చిన అలర్ట్ మేసేజ్
Delhi School Fees: ఆదేశంలోని ముఖ్యాంశాలు:
పాఠశాలలు కేవలం ఒక క్యాలెండర్ నెలకు సంబంధించిన ఫీజును మాత్రమే వసూలు చేయాలి. మూడు నెలల ఫీజును (Quarterly) అడ్వాన్స్‌గా కట్టాలని బలవంతం చేయడం నిబంధనలకు విరుద్ధం.అడ్మిషన్ ఇవ్వాలన్నా లేదా విద్యార్థిని స్కూల్‌లో కొనసాగించాలన్నా ముందస్తుగా ఫీజులు కట్టాలనే షరతులు విధించకూడదు.ఈ ఆదేశాలను పాఠశాల నోటీస్ బోర్డులపై, అధికారిక వెబ్‌సైట్లలో 7 పనిదినాల్లోపు అప్‌లోడ్ చేయాలి.ఈ నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలపై ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ యాక్ట్, 1973 ప్రకారం చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.
Delhi Private School Fees
తల్లిదండ్రులకు ఆర్థిక ఊరట
చాలా పాఠశాలలు ఒకేసారి మూడు నెలల ఫీజును (దాదాపు 50 వేల రూపాయల వరకు) కట్టాలని ఒత్తిడి చేయడం వల్ల మధ్యతరగతి, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. తాజా ఆదేశాలతో తల్లిదండ్రులు తమ వెసులుబాటును బట్టి నెలవారీ ఫీజులు కట్టుకునే అవకాశం కలిగింది.
Read Also hindi news: hindi.vaartha.com

