Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్.. మహిళలకు నెలకు రూ.2500 నగదు!

ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్.. మహిళలకు నెలకు రూ.2500 నగదు!

వార్త 1 week ago

Delhi Government Schemes:ఢిల్లీ ప్రభుత్వం మహిళల ఆర్థిక భరోసా కోసం ప్రతిష్టాత్మక మహిళా సమృద్ది యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు తోడ్పాటు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ఆగస్టు 28న రక్షాబంధన్ కానుకగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా రూ.2500 నేరుగా జమ చేస్తారు. ఈ సాయం ద్వారా 20 నుంచి 22 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ నగదు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ పద్ధతిని సిద్ధం చేసింది.

Read also: PF Update: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

 Benefits under Mahila Samriddhi Yojana

పథకం అర్హతలు నిబంధనలు

ఈ పథకం పొందాలంటే మహిళలు 21 నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. గత ఐదేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్న వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షల లోపు ఉండాలి. రేషన్ కార్డు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కారు కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు కారు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు. ఇతర పెన్షన్లు పొందే మహిళలకు కూడా ఈ సాయం అందదు. కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఈ ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది.

Delhi Government Schemes:దరఖాస్తు ప్రక్రియ ముఖ్య పత్రాలు

దరఖాస్తు చేసుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్న మహిళలు ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు సిద్ధం చేసుకోవాలి. ఆధార్ కార్డు ఆధార్ అనుసంధానం ఉన్న మొబైల్ నంబర్ అవసరం. ఆదాయ ధ్రువీకరణ పత్రం బ్యాంక్ ఖాతా పుస్తకం ఫోటోలు సమర్పించాలి. సరైన సమాచారం అందిస్తేనే నగదు సకాలంలో జమ అవుతుంది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించి దరఖాస్తు పూర్తి చేయవచ్చు.

Epaper: epaper.vaartha.com

సమోసాల కోసం రైలును ఆపిన లోకో పైలట్?సోషల్ మీడియా వైరల్ వీడియోపై రైల్వే శాఖ సంచలన క్లారిటీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha