IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ సిబ్బందిని మరింత పటిష్టం చేసుకుంది. అనుభవజ్ఞులైన మాజీ క్రికెటర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఢిల్లీ జట్టు మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది.
ఇందులో భాగంగా ఫ్రాంచైజీ మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రాను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
కోచింగ్‌లోకి అమిత్ మిశ్రా ఎంట్రీ
ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అమిత్ మిశ్రా.. ఐపీఎల్ కోచ్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఆటగాడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న మిశ్రా, ఐపీఎల్‌లో మొత్తం 4 వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 162 మ్యాచ్‌లు ఆడారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్), డెక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా ఉన్న ఆయన మొత్తం 174 వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా టోర్నమెంట్‌లో అత్యధికంగా మూడు హ్యాట్రిక్‌లు సాధించిన రికార్డు ఆయన పేరిటే ఉంది.
“ది ఓజీ టైగర్ తిరిగొచ్చాడు!
ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మా అమిత్ మిశ్రా ఇప్పుడు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు” అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) అధికారికంగా ప్రకటించింది.
Vaibhav Suryavanshi: వైభవ్ కి టీమిండియాలో చోటు ఇప్పట్లో లేనట్టేనా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే!
బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం చమిందా వాస్
ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచింగ్ ప్యానెల్‌లో శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ ప్రధాన బౌలింగ్ కోచ్‌గా చేరారు. గత రెండు సీజన్లుగా ఈ బాధ్యతలు నిర్వర్తించిన మునాఫ్ పటేల్ స్థానంలో వాస్‌ను మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. శ్రీలంక క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో వాస్ ఒకరు. టెస్టుల్లో 355 వికెట్లతో ఆ దేశం తరఫున మూడో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, వన్డేల్లో (ODIs) 400 వికెట్లతో రెండో స్థానంలో నిలిచారు. బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లోనూ రాణించిన ఆయన 111 టెస్టుల్లో 3,089 పరుగులు, 322 వన్డేల్లో 2,025 పరుగులు సాధించారు.

హెడ్‌కోచ్‌గా సౌరవ్ గంగూలీ
ఐపీఎల్ 2027 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఇప్పటికే ఈ జట్టుకు ప్రధాన కోచ్‌గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యవహరిస్తున్నారు. తాజాగా అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా మరో దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్‌ను కూడా నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమిత్ మిశ్రా చేరికతో ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ విభాగం మరింత బలంగా తయారైంది.
https://vaartha.com/sports/hardik-pandya-undergoing-rehabilitation-to-recover-from-an-injury/793882/

