Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీకి చంద్రబాబు.. జల వివాదాలపై కేంద్రంతో తేల్చుకోనున్న ఏపీ సీఎం!

ఢిల్లీకి చంద్రబాబు.. జల వివాదాలపై కేంద్రంతో తేల్చుకోనున్న ఏపీ సీఎం!

వార్త 3 months ago

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 11వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగే ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన భేటీ అవుతారు.

ముఖ్యంగా ఏపీకి రావాల్సిన నీటి వాటాలు, ఇతర పెండింగ్ అంశాలపై కేంద్రంతో నేరుగా చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Read also: Ashok Dinda: బెంగాల్ క్రీడా మంత్రిగా మాజీ క్రికెటర్ అశోక్ దిండా!

 CM Chandrababu Delhi Tour 2026

Chandrababu Naidu: గోదావరి వివాదాలపై కేంద్రంతో కీలక చర్చ

తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ పనులను అడ్డుకోవాలని చంద్రబాబు కోరనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీకి జరిగే నష్టాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు వివరించనున్నారు. గోదావరి నీటి పంపిణీ కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తిని ప్రధానంగా కేంద్రం ముందు ఉంచనున్నారు.

కృష్ణా నది జలాల రక్షణే ధ్యేయం

కృష్ణా నదిపై కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే ప్రయత్నాలను అడ్డుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు. డ్యాం ఎత్తు పెంచితే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని ఈ పర్యటనలో గట్టిగా కోరనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే మద్దతు కీలకం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha