Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు

ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు

వార్త 2 weeks ago

Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఈ అకస్మిక కుండపోత కారణంగా ప్రముఖ ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయం ప్రాంగణం పూర్తిగా నీట మునిగింది.

ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు నిలవడంతో విమానాశ్రయ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దారి మళ్లించిన విమానాలు.. 400కు పైగా సర్వీసులు ఆలస్యం

ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల మధ్య దాదాపు తొమ్మిది విమానాలను ఇతర నగరాలకు మళ్లించారు. వీటిలో నాలుగు జైపూర్‌కు, మరో నాలుగు లక్నోకు, ఒకటి అహ్మదాబాద్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఫ్లైట్‌రాడార్24 నివేదికల ప్రకారం, దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ ఎయిర్‌పోర్ట్‌లో 400కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Delhi Rains: ప్రయాణికులకు విమానయాన సంస్థల హెచ్చరికలు, ఐఎండీ రెడ్ అలర్ట్

వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందే తమ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు కోరాయి. రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదించడంతో ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవాలని సూచించారు. మరోవైపు, పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది.

రామభక్తుల మద్దతే ప్రధాన బలం: జితేంద్ర మిశ్రా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha