Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీలో సీజేపీ నిరసన.. భారీగా అరెస్టులు

ఢిల్లీలో సీజేపీ నిరసన.. భారీగా అరెస్టులు

వార్త 2 weeks ago

CJP Protest Delhi: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆందోళన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిరసనను భగ్నం చేసేందుకు పోలీసులు నగరం నలుమూలలా ముందస్తు అరెస్టులు చేపట్టడంతో రాజధానిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read Also : Protests in Delhi : ఢిల్లీలో నిరసనలు..అసలు ఏం జరగబోతోంది?

 CJP protest in Delhi… mass arrests.

CJP Protest Delhi: వేలాది మంది భద్రతా సిబ్బంది మోహరింపు – డిటెన్షన్ సెంటర్ల ఏర్పాటు

ర్యాలీని అడ్డుకోవడానికి ఢిల్లీ పోలీసులు భారీ స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరుకుంటున్న సీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలోని న్యూఢిల్లీ ప్రాంతాన్ని 20 జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌లోనూ క్రీడా స్టేడియంలను తాత్కాలిక డిటెన్షన్ సెంటర్లుగా మార్చారు. సుమారు 20 వేల మంది భద్రతా సిబ్బందితో నగరంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిరసనకారులు జంతర్ మంతర్ వైపు రాకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని 45 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఆందోళనకారుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా గగనతల నిఘాను ఏర్పాటు చేశారు.

ఢిల్లీలో అడుగడుగునా నిఘా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha