Dailyhunt
ఢిల్లీపై 'సూపర్' విక్టరీ: సంజూ శాంసన్‌పై కెప్టెన్ రుతురాజ్ ప్రశంసల జల్లు..

ఢిల్లీపై 'సూపర్' విక్టరీ: సంజూ శాంసన్‌పై కెప్టెన్ రుతురాజ్ ప్రశంసల జల్లు..

వార్త 2 days ago

Ruturaj Gaikwad: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది.

సమష్టి కృషితో సాధించిన ఈ విజయం పట్ల సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపుతో ప్లే-ఆఫ్స్ రేసులో చెన్నై తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

Read Also:Aryna Sabalenka: "మా హక్కుల కోసం పోరాడతాం" - ప్రైజ్ మనీ పెంపుపై సబలెంకా ఘాటు వ్యాఖ్యలు

సంజూ శాంసన్: జట్టుకు దొరికిన అదృష్టం

ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్ (87 నాటౌట్) పై రుతురాజ్ ప్రశంసల వర్షం కురిపించారు. “సంజూ లాంటి నిలకడైన ఆటగాడు మా జట్టులో ఉండటం మా అదృష్టం. టీ20 ప్రపంచకప్ 2026లో తాను చూపించిన భీభత్సమైన ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదిన సంజూ, ఢిల్లీలోని కఠినమైన పిచ్‌పై 87 పరుగులతో అజేయంగా నిలవడం అద్భుతం” అని రుతురాజ్ కొనియాడారు.

 Ruturaj Gaikwad CSK vs DC Post Match

Ruturaj Gaikwad: నిశ్శబ్దంగా పని ముగిస్తున్న బౌలర్లు

జట్టు బౌలింగ్ విభాగంపై కూడా కెప్టెన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అఖీల్ హోసేన్, జేమీ ఓవర్టన్ మరియు అన్షుల్ కంబోజ్ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. “మా బౌలర్లు పెద్దగా హడావుడి లేకుండా నిశ్శబ్దంగా తమ పనిని పూర్తి చేసుకుంటూ జట్టుకు విజయాలను అందిస్తున్నారు” అని రుతురాజ్ పేర్కొన్నారు.

సీజన్ ప్రారంభం నుండి కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్,తాను చాలా సానుకూల దృక్పథంతో ఉన్నామని రుతురాజ్ వెల్లడించారు. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని, ఇదే ఊపును కొనసాగించి ప్లే-ఆఫ్స్‌లో ఘనంగా అడుగుపెడతామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇంటికే అనుకున్న CSK.. ప్లేఆఫ్స్ రేసులోకి..!!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha