Dailyhunt
డీఎంకే 'సూపర్ స్టార్' మేనిఫెస్టో విడుదల.. మహిళలకు నెలకు రూ. 2000

డీఎంకే 'సూపర్ స్టార్' మేనిఫెస్టో విడుదల.. మహిళలకు నెలకు రూ. 2000

వార్త 2 weeks ago

DMK Manifesto Highlight: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026కు సంబంధించి అధికార డీఎంకే పార్టీ తన ఎన్నికల ప్రణాళికను (Manifesto) ప్రకటించింది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం 'అన్నా అరివళయం'లో ముఖ్యమంత్రి ఎం.కె.

స్టాలిన్ ఆదివారం ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ మేనిఫెస్టోను ఒక 'సూపర్ స్టార్'గా అభివర్ణించిన స్టాలిన్, ఇది తమకు మరోసారి ఘన విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: MRI Scan Prices Hike: పెరగనున్న ఎంఆర్‌ఐ స్కాన్ ధరలు

DMK Manifesto Highlight: మహిళా ఓటర్ల కోసం 'ఇల్లతరసి' పథకం

ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు 'ఇల్లతరసి' పథకం కింద గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు రూ. 8,000 విలువైన వన్‌టైమ్ కూపన్ అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు ఇస్తున్న రూ. 1,000 నెలసరి ఆర్థిక సాయాన్ని రూ. 2,000కు పెంచుతామని ప్రకటించారు.

 DMK Manifesto 2026 Tamil Nadu Elections

యువతకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని.. రైతులకు ఉచితంగా మీటర్లు లేని వ్యవసాయ మోటర్లు పంపిణీ చేస్తామని డీఎంకే ప్రకటించింది. పది లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం, పది లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా.. విద్యార్థినులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.1500లకు పెంపు వంటి హామీలను డీఎంకే తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది.

ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, "సాధారణంగా ఎన్నికల్లో డీఎంకే మేనిఫెస్టో హీరో అయితే, ఈసారి మా 'ద్రావిడ మోడల్ 2.0' మేనిఫెస్టో ఒక సూపర్ స్టార్" అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ మేనిఫెస్టోపై ప్రతిపక్ష పీఎంకే స్పందిస్తూ, 2021లో ఇచ్చిన 505 హామీల్లో 439 నెరవేర్చలేదని, వాటినే కొత్త మేనిఫెస్టోగా ప్రకటించి ఉండాల్సిందని విమర్శించింది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే మేనిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కన్నకూతురిని చంపిన కిరాతక తండ్రి.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha