Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిగ్రీలు లేవు.. వయసు 13 ఏళ్లే..నెలకు కోటి రూపాయల సంపాదన

డిగ్రీలు లేవు.. వయసు 13 ఏళ్లే..నెలకు కోటి రూపాయల సంపాదన

వార్త 1 week ago

Ayush Singh: ఆర్థిక ఇబ్బందులు, వనరుల కొరత ఉన్నప్పటికీ పట్టుదల ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడు 13 ఏళ్ల భారతీయ బాల మేధావి ఆయుష్ సింగ్ (Ayush Singh).

కొవిడ్ మహమ్మారి సమయంలో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో.. పాత తరం ల్యాప్‌టాప్, సరిగా పనిచేయని ఇంటర్నెట్ కనెక్షన్‌తోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో అద్భుతాలు సృష్టించాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే అత్యాధునిక AI కోర్సులను రూపొందిస్తూ.. ప్రస్తుతం నెలవారీగా రూ. 1 కోటికి పైగా ఆర్జిస్తూ గ్లోబల్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు.

Read also:Whatsapp : ఆన్లైన్ స్కామ్ కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్

పాత ల్యాప్‌టాప్ నుంచి గ్లోబల్ స్టార్టప్స్ వరకు

లాక్‌డౌన్ సమయంలో ప్రపంచమంతా స్థంభించిపోయిన వేళ, ఆయుష్ సింగ్ తన స్వీయ అభ్యాస (Self-learning) నైపుణ్యంతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు.

  • మషిన్ లెర్నింగ్ సాధన: సరైన ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా, పాత కోర్సుల మెటీరియల్స్ మరియు నెమ్మదైన ల్యాప్‌టాప్ సహాయంతోనే 'మషిన్ లెర్నింగ్' (Machine Learning) లో పట్టు సాధించాడు.
  • MIT సిఫార్సుతో గుర్తింపు: ఆయుష్ ప్రతిభను గుర్తించిన ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) అతనిని ప్రత్యేకంగా సిఫార్సు చేయడంతో ఈ బుడతడి టాలెంట్ అంతర్జాతీయ వేదికలపై వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పలు విదేశీ లీడింగ్ స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తూ అత్యున్నత ప్రమాణాలు గల AI కోర్సులను అభివృద్ధి చేశాడు.

Ayush Singh: టాప్‌మేట్ వేదికగా నెలకు కోటి రూపాయల బిజినెస్

ఐఐటీ (IIT) లేదా ఐఐఎం (IIM) వంటి ప్రతిష్టాత్మక డిగ్రీలు ఏవీ లేకపోయినా.. కేవలం ప్రాక్టికల్ నాలెడ్జ్, కోడింగ్ స్కిల్స్‌తోనే ఆయుష్ కార్పొరేట్ ప్రపంచంలో వృత్తిపరమైన గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం ఆయుష్ సింగ్ ప్రముఖ మెంటర్‌షిప్ ప్లాట్‌ఫామ్ 'టాప్‌మేట్' (Topmate) వేదికగా ప్రీమియం AI కోహార్ట్‌లను (Cohort-based courses) విజయవంతంగా నడుపుతున్నాడు. ఇందులో భాగంగా ఒక్కో కోర్సును రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు విక్రయిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో టెక్ ప్రొఫెషనల్స్, విద్యార్థులు ఈ 13 ఏళ్ల బాలుడి వద్ద AI పాఠాలు నేర్చుకోవడానికి క్యూ కడుతుండటం విశేషం.

భారీగా పెరగనున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు! కారణం ఇదే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha